Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఏపీ ప్రభుత్వం సోమవారం శుభవార్త చెప్పనుందా?

అమరావతి: పీఆర్సీ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు మూడు రోజులుగా కదం తొక్కుతున్నాయి. ఇప్పటికే పీఆర్సీ సాధన కోసం సంఘాలు కార్యచరణ కూడా ప్రకటించాయి. ఈ నేపథ్యంలో పీఆర్సీపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. సమావేశం ముగిసిన తర్వాత ఉద్యోగుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 34 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చే అవకాశం ఉందంటూ ఉద్యోగుల వాట్సాప్‌ గ్రూప్‌ల్లో సందేశాలు వైరల్ అవుతున్నాయి. పీఆర్సీపై ప్రభుత్వ నిర్ణయం సోమవారం ప్రకటించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఏళ్ల తరబడి ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోవడంతో ఉద్యోగుల్లో అసంతృప్తి పెల్లుబుకుతోంది. 


వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వా త ఉద్యోగులకు సంబంధించిన ఆర్థిక, ఆర్థికేతర సమస్యలు ఏ ఒక్కటీ పరిష్కరించకపోవడంతో ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి పీఆర్సీతో సహా ఉద్యోగుల సమస్యలన్నీ తక్షణమే ప్రభుత్వం పరిష్కరించాలంటూ ఉద్యమ కార్యాచరణకు పిలుపునిచ్చాయి. జేఏసీలు ఇచ్చిన ఐక్య ఉద్యమ కార్యాచరణకు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు నిరసన కార్యాక్రమాల్లో పాల్గొంటున్నారు. నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతున్నారు. ఉద్యోగులతో పాటు విశ్రాంత ఉద్యోగులు ఉద్యమానికి ఊతం ఇస్తున్నారు.

Advertisement
Advertisement