ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఎన్నో తేదీన ఇస్తారంటే..

ABN , First Publish Date - 2020-04-04T19:40:09+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగులకు ఈనెల 6న జీతాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం ఆర్థికశాఖ ఉన్న తాధికారులు జిల్లా ఖజానా శాఖ అధికారులతో నిర్వహించిన

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఎన్నో తేదీన ఇస్తారంటే..

6న ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు 

ఒంగోలు (ప్రకాశం జిల్లా): ప్రభుత్వ ఉద్యోగులకు ఈనెల 6న  జీతాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం ఆర్థికశాఖ ఉన్న తాధికారులు జిల్లా ఖజానా శాఖ అధికారులతో నిర్వహించిన వీడియో కా న్ఫరెన్సులో ఈవిషయాన్ని ప్రకటించారు. ఖజానా కార్యాలయాల ద్వారా సీఎంఎఫ్‌ఎస్‌ విధానంలో మంజూరైన జీతాల బిల్లుల్లో ప్రతి ఉద్యోగికి 50 శాతం గ్రాస్‌శాలరీ అన్ని ప్రభుత్వశాఖ బిల్లులను రద్దు చేశారు. ఖజానా శాఖ, స్టేట్‌ అడిట్‌, ఏపీజీఎల్‌ఐ, పేఅండ్‌ అకౌంట్స్‌, వర్కు అకౌంట్స్‌ శాఖల ఉద్యోగులకు జీతాలు డ్రా చేస్తున్నారు. ఈ ఐదు శాఖల జీతాల బిల్లులను 50శాతం గ్రాస్‌ శాలరీలకే పరిమితం చేస్తూ తాజాగా మరలా జీతాల బిల్లులు సమర్పించాల్సి ఉంది. వీరికి కూడా 50శాతం గ్రాస్‌శాలరీని బిల్లు పెట్టాల్సి ఉంటుంది. మార్చి నెల జీతాలు బిల్లులు పెట్టని వారు వరుసగా పెట్టే బిల్లులకు 50శాతం మొత్తాలనే క్లయింట్‌ చేయాలి. ప్రస్తుతం చెల్లింపులు 50శాతం జీతంలో ఎటువంటి ప్రభుత్వ మినహాయింపులు ఉండవని ఆర్థికశాఖ అధికారులు స్పష్టం చేశారు. 

Updated Date - 2020-04-04T19:40:09+05:30 IST