Advertisement
Advertisement
Abn logo
Advertisement

నోరు పారేసుకుంటే నాలుక చీరుస్తా: ఉదయభాను

ఖమ్మం: వైసీపీ నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధిర మున్సిపల్ కౌన్సిలర్ మల్లాది వాసుపై ఏపీ ప్రభుత్వ విప్‌ ఉదయభాను తీవ్ర ఆగ్రహం చేశారు. వాసుని ఆయన హెచ్చరించారు. మరోసారి వైసీపీ సహా కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబుపై నోరు పారేసుకుంటే నాలుక చీరుస్తానని ఆయన హెచ్చరించారు. వాసుపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీలో ఏం జరిగిందో తెలుసుకుని మాట్లాడాలని ఆయన అన్నారు. మధిరలో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో ఉదయభాను పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు.   


ఏపీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబులను హత్య చేయడానికి ముందుకొస్తే తాను రూ. 50 లక్షలు ఇస్తానని వాసు ప్రకటించిన విషయం తెలిసిందే. కమ్మ కులం నుంచి నాని, వంశీలను వెలి వేయాలని తీర్మానించాలన్నారు. అలాగే అంబటిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

కమ్మ కులంలో పుట్టి ఎదిగిన కొడాలి నాని, వల్లభనేని వంశీతో పాటు అంబటి రాంబాబులను భౌతికంగా నిర్మూలించడానికి తన వంతుగా రూ.50 లక్షలు ఇస్తానని కమ్మ వనసమారాధానలో చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్నాయి. Advertisement
Advertisement