స్టేట్ డెవలప్మెంట్ కార్పోరేషన్ పేరిట నిధులు కేటాయింపుపై హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2021-07-06T22:48:18+05:30 IST

స్టేట్ డెవలప్మెంట్ కార్పోరేషన్ పేరిట నిధులు కేటాయింపుపై హైకోర్టులో విచారణ

స్టేట్ డెవలప్మెంట్ కార్పోరేషన్ పేరిట నిధులు కేటాయింపుపై హైకోర్టులో విచారణ

అమరావతి: స్టేట్ డెవలప్మెంట్ కార్పోరేషన్ పేరిట నిధులు కేటాయింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. వెలగపూడి రామకృష్ణబాబు పిటిషన్ దాఖలు చేశారు. కార్పేరోషన్‌కు నిధుల కేటాయింపుపై స్టే ఇవ్వాలని పిటిషనర్‌ తరపు న్యాయవాది కోరారు. స్టే ఇవ్వడానికి వీలు లేదని ప్రభుత్వ తరపు న్యాయవాది దుష్యంత్ దవే పేర్కొన్నారు. నోటీసులు ఇచ్చినా బ్యాంకులు రుణాలు ఇవ్వడం నిలిపివేస్తాయని ఆయన పేర్కొన్నారు. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్‌ తరపు న్యాయవాది బాలాజీ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పులను ఇరు పక్షాల న్యాయవాదులు ప్రస్తావించారు. లోతుగా విచారిస్తామన్న ధర్మాసనం విచారణను గురువారానికి వాయిదా వేసింది. పిటిషనర్ తరపున న్యాయవాది యలమంజుల బాలాజీ వాదించారు. ప్రభుత్వం తరపున వాదనలను సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది దుష్యంత్ దవే వినిపించారు.

Updated Date - 2021-07-06T22:48:18+05:30 IST