Advertisement
Advertisement
Abn logo
Advertisement

దేవినేని ఉమ బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ

అమరావతి: మాజీ మంత్రి దేవినేని ఉమ బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఉత్తర్వుల కోసం  హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఉమ తరపున పోసాని వెంకటేశ్వర్లు, ప్రభుత్వం తరపున ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ కేసులో ఎటువంటి గాయాలు లేవని, హత్యాయత్నం సెక్షన్లు వర్తించవని ఉమ తరపు న్యాయవాదులు పేర్కొన్నారు.  ఫిర్యాదు ఇచ్చిన వారు వసంత్ కృష్ణప్రసాద్ సన్నిహత సహచరుడు పాలడుగు దుర్గాప్రసాద్ డ్రైవర్ అని డిఫెన్స్ న్యాయవాది పేర్కొన్నాడు. డ్రైవర్ కులం తెలిసే అవకాశం ఉమకు లేదని న్యాయవాది చెప్పాడు. రాజకీయ కక్షతోనే ఆయన్ను కేసులో ఇరికించారని న్యాయవాదులు పేర్కొన్నారు. ఈ కేసులో పెట్టిన మిగతా నిందితులపై ఎటువంటి ఆరోపణలు లేవని పోసాని పేర్కొన్నారు. కేసు విచారణ జరుగుతుందని, మిగతా నిందితులను అరెస్టు చేయాల్సి ఉందని, ఈ దశలో బెయిల్ ఇవ్వడం మంచిది కాదని  ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. పోలీసులు కస్టడీ పిటిషన్ కూడా మచిలీపట్నం కోర్టులో వేశారని న్యాయవాది  తెలిపారు. ఇరు పక్షాల విన్న అనంతరం ఉత్తర్వుల కోసం రేపటికి కోర్టు వాయిదా వేసింది. 

Advertisement
Advertisement