ఎస్ఈసీ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2021-01-19T18:08:03+05:30 IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరుగుతోంది.

ఎస్ఈసీ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరుగుతోంది. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రద్దును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం, ఎస్ఈసీ తరఫున వాదనలు పూర్తయ్యాయి.


గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను సస్పెండ్ చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ హైకోర్టులో హౌస్ పిటిషన్ మోషన్ దాఖలు చేసింది. దీనిపై నిన్న ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరాం సుబ్రహ్మణ్యం, ఎస్ఈసీ తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు, నిమ్మగడ్డ తరఫున డీవీ సీతారామ్మూర్తి వాదనలు వినిపించారు. మంగళవారం ప్రభుత్వం వాదనలపై ఎస్ఈసీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఒకసారి ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన తర్వాత కోర్టులు జోక్యం చేసుకోకూడదని, ఇంత వరకు ఎక్కడా జరగలేదని అన్నారు. ఈ సందర్భంగా గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును న్యాయవాది ఆదినారాయణరావు న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. ఇంకా వాదనలు కొనసాగుతున్నాయి.

Updated Date - 2021-01-19T18:08:03+05:30 IST