Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రభుత్వ జీవోను సస్పెండ్‌ చేసిన ఏపీ హైకోర్టు

అమరావతి: మంగళగిరి ప్రభుత్వాసుపత్రిలోని ఎకరం స్థలాన్ని షాపింగ్‌ కాంప్లెక్స్‌కు కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్టు సస్పెండ్‌ చేసింది. ఆస్పత్రి ఆవరణలోని స్ధలాన్ని షాపింగ్‌ కాంప్లెక్స్‌ కోసం మంగళగిరి మున్సిపాలిటీకి ఇస్తూ జీవో నెం.79ని  ప్రభుత్వం జారీ చేసింది. మంగళగిరి ప్రజల అవసరాల కోసం నిర్మించిన ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా చేసే తరుణంలో స్ధలం కాంప్లెక్స్‌ నిర్మాణానికి ఎలా ఇస్తారంటూ హైకోర్టులో ఎస్‌.ఎస్‌.చెంగయ్య పిటిషన్‌ వేశారు. ప్రజాప్రతినిధి ఒత్తిడి మేరకు స్థలాన్ని షాపింగ్‌ కాంప్లెక్స్‌కు ఎలా కేటాయిస్తారని న్యాయవాది నర్రా శ్రీనివాస్‌ వాదించారు. జీవో 79ని సస్పెండ్‌ చేస్తూ హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.


Advertisement
Advertisement