Abn logo
Sep 20 2021 @ 16:47PM

టీడీపీ నేతలపై పోలీసులు నమోదు చేసిన కేసులపై హైకోర్టులో పిటిషన్‌

అమరావతి: టీడీపీ నేతలపై పోలీసులు నమోదు చేసిన కేసులపై ఏపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. టీడీపీ నేత బ్రహ్మంపై దాడి కేసు, టీడీపీ నేతలపై ఎస్సీ, ఎస్టీ కేసులు కొట్టివేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై రేపు ధర్మాసనం విచారించనుంది. పిటిషనర్ తరపు లాయర్‌ కోటిరెడ్డి వాదనలు వినిపించనున్నారు.