Abn logo
Sep 21 2021 @ 18:19PM

ఏపీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు

అమరావతి: ఏపీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. గుంటూరు జిల్లా కొల్లూరులో ఇద్దరు వ్యక్తులను ఇల్లీగల్ కస్టడీకి తీసుకొని పోలీసులు చిత్రహింసలకు గురిచేసారంటూ పిటిషన్ వేశారు. షేక్ అక్తర్ రోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఇల్లీగల్ కస్టడీపై ధర్మాసనం సీరియస్ అయింది. ఇల్లీగల్ కస్టడీకి తీసుకోని చిత్రహింసలకు గురిచేయడం ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. తప్పు చేస్తే శిక్షించేందుకు న్యాయస్థానాలు ఉన్నాయని హైకోర్టు పేర్కొంది. ఏడిజి అధికారితో విచారణ జరిపించి పూర్తి సమాచారం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. పిటిషనర్ తరుపు న్యాయవాది రాజారెడ్డి వాదనలు వినిపించారు. 

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...