అమరావతి: హైకోర్టు దెబ్బకు దిగొచ్చిన ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-10-06T18:36:07+05:30 IST

అమరావతి: హైకోర్టు దెబ్బకు జగన్ ప్రభుత్వం దిగొచ్చింది.

అమరావతి: హైకోర్టు దెబ్బకు దిగొచ్చిన ప్రభుత్వం

అమరావతి: హైకోర్టు దెబ్బకు జగన్ ప్రభుత్వం దిగొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు.. పార్టీ రంగులు తొలగిస్తున్నట్లు హైకోర్టులో పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రమాణ పత్రం దాఖలు చేశారు. భవిష్యత్‌లో ఏ ప్రభుత్వ భవనానికి కూడా పార్టీ రంగులు వేయబోమంటూ ఆయన న్యాయస్థానంలో ప్రమాణపత్రం దాఖలు చేశారు. 


పార్టీ రంగులు వేస్తున్నారని జై భీమ్ జస్టిస్ కృష్ణా జిల్లా అధ్యక్షుడు సురేష్‌ కుమార్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. దీనిపై బుధవారం విచారణ జరిగింది. పిటిషనర్ తరపున న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్ వాదనలు వినిపించారు. పార్టీ రంగులు తొలగించి ప్రమాణపత్రం దాఖలు చేయాలని..గత నెలలో ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో ఇవాళ విచారణ సందర్బంగా పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రమాణ పత్రం దాఖలు చేశారు. 

Updated Date - 2021-10-06T18:36:07+05:30 IST