Abn logo
Jul 23 2021 @ 18:06PM

ఫెయిల్ అయిన విద్యార్థులకూ 35 శాతం మార్కులు

అమరావతి: ఏపీ ఇంటర్ మీడియేట్ సెకండియర్‌ ఫలితాలను మంత్రి ఆదిమూలపు సురేష్‌ విడుదల చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారం ముందుగానే ఫలితాలను విడుదల చేశామన్నారు. మినిమమ్‌ పాస్‌ మార్కులతో అందరినీ పాస్‌ చేస్తామని మంత్రి సురేష్‌ ప్రకటించారు. bie.ap.gov.in వెబ్‌సైట్‌లో ఏపీ ఇంటర్‌ ఫలితాలను చూసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 26న సా.5 గంటల నుంచి వెబ్‌సైట్‌లో మెమోలు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. ఫెయిల్, ఆబ్సెంట్‌ అయిన విద్యార్థులకు కూడా 35 శాతం మార్కులు ఇస్తామని ఆయన ప్రకటించారు. పరిస్థితులు చక్కబడ్డాక ఫస్టియర్‌ విద్యార్థులకు బెటర్మెంట్‌ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి సురేష్‌ తెలిపారు.