Abn logo
Aug 2 2021 @ 18:58PM

ఏపీలో ఇద్దరు ఐఏఎస్ అధికారుల బదిలీ

అమరావతి: ఏపీలో ఇద్దరు ఐఏఎస్ అధికారుల బదిలీ అయ్యారు. ప్రణాళిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ‌గా సమీర్ శర్మ బదిలీ అయ్యారు. సమీర్ శర్మను ఇన్స్టిట్యూట్ ఆఫ్ లీడర్ షిప్, ఎక్స్లెన్సు అండ్ గవర్నెన్స్‌కు వైస్ చైర్ పర్సన్ మరియు మెంబర్ సెక్రటరీగా కూడా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. పర్యావరణ మరియు అటవీ శాఖ,శాస్త్ర, సాంకేతిక విభాగాల్లో కార్యదర్శిగా ఉన్న విజయకుమార్.... ఆయన అటు ప్రణాళిక శాఖ కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారని ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఈ అదేశం అమలులో వుంటుందని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు.