కారుణ్య నియామకాలు చేపట్టాలి

ABN , First Publish Date - 2021-10-25T04:54:54+05:30 IST

కారుణ్య నియామకాలపై ప్రభుత్వం ఇచ్చిన జీవోకు బదులు కొన్ని సవరణలతో వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ ద్వారా ప్రభుత్వం ఉత్త ర్వులు ఇవ్వాలని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు డిమాండ్‌ చేశారు.

కారుణ్య నియామకాలు చేపట్టాలి
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న బొప్పరాజు

ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు


ఏలూరు రూరల్‌, అక్టోబరు 24: కారుణ్య నియామకాలపై ప్రభుత్వం ఇచ్చిన జీవోకు బదులు కొన్ని సవరణలతో వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ ద్వారా ప్రభుత్వం ఉత్త ర్వులు ఇవ్వాలని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు డిమాండ్‌ చేశారు. రెవెన్యూ భవనంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలను తక్షణమే ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో అర్హులైన కుటుంబ సభ్యులకు ఈనెల 30 లోగా మిషన్‌మోడ్‌లో ఉద్యోగా లు ఇవ్వాలని సీఎం భావించారన్నారు. అయితే ఉన్నతాధికారులు ఇచ్చిన మెమోలో మాత్రం కేవలం కరోనా కారణంగా చనిపోయిన వారికి మొదటి ప్రాధాన్యం ఇచ్చి ప్రస్తుతం కారుణ్య నియామకాల నిబంధనల మేరకు ఉద్యోగాలు కల్పించాలని మెమోలో పేర్కొన్నారన్నారు. ఆ మెమో ప్రయోజనం లేకపోగా కరోనా కన్నా ముం దు చనిపోయిన ఉద్యోగుల కుటుంబాల వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. కారుణ్య నియామకాలు పొందక రాష్ట్రంలో అనేక మంది ఎదురు చూస్తున్నారని వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ ద్వారా కొన్ని సవరణలు చేసి కొత్త ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కలెక్టర్‌ ఆమోదంతో సంబంధం లేకుండా అవసరమైన శాఖలో సూపర్‌మెమరీ పోస్టులు క్రియేట్‌ చేసుకునే అధికారం సంబంధిత శాఖ అధికారులకే కల్పించాలని, నో ప్రయార్టీ సర్టిఫికెట్‌, నో ఎర్నింగ్‌ నెంబర్‌ సర్టిఫికెట్ల కోసం వేచి చూడకుండా ఉద్యోగం కల్పించేవిధంగా సవరణలు చేయాలని తెలిపారు. సెక్రటరీ జనరల్‌ వైవి రావు మాట్లాడుతూ సీపీఎస్‌ రద్దు చేసి ఓపీఎస్‌ పెన్షన్‌ ప్రకటించాలని కోరారు. ఏపీ జేఏసీ జిల్లా ఛైర్మన్‌ హరనాధ్‌, ఏపీ జేఏసీ అమరావతి జిల్లా అధ్యక్షుడు రమేష్‌కుమార్‌, మాట్లాడారు. సమావేశంలో డీఎస్‌ కొండయ్య, చోడగిరి శ్రీనివాస్‌, ప్రమోద్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-25T04:54:54+05:30 IST