బోగస్‌ క్యాలెండర్‌తో నిరుద్యోగులకు అన్యాయం

ABN , First Publish Date - 2021-07-19T13:37:50+05:30 IST

ప్రభుత్వం ప్రకటించిన జాబ్‌ క్యాలెండర్‌తో..

బోగస్‌ క్యాలెండర్‌తో నిరుద్యోగులకు అన్యాయం

తెనాలిటౌన్‌: ప్రభుత్వం ప్రకటించిన జాబ్‌ క్యాలెండర్‌తో నిరుద్యోగులకు తీరని అన్యాయం  జరిగిందని పలువురు తెలుగు యువత నాయకులు అన్నారు. ఆదివారం టీడీపీ కార్యాలయంలో జాబ్‌ క్యాలెండర్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ప్లకార్డులు చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సోమవారం తలపెట్టిన సీఎం కార్యాలయ ముట్టడిని భగ్నం చేసేందుకు నాయకులను అరెస్టు చేయడం తగదన్నారు.. ఎంతమందిని అరెస్టు చేసి నా సీఎం కార్యాలయాన్ని ముట్టడించి తీరతామన్నా రు. అక్రమ అరెస్టులకు నిరసనగా నినదించారు. తొలుత అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అంబేద్కర్‌ కల్పించిన హక్కులను కాలరాస్తున్న పాలకులకు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. ఎన్ని కల వాగ్దానాల్లో నిరుద్యోగులకు 2.35 లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పి కేవలం 10వేల ఉద్యోగాలకు ప్రకటన చేసి చేతులు దులుపుకున్నారన్నారు. ప్రభుత్వం విడుదల చేసిం ది జాబ్‌ క్యాలెండర్‌ కాదని అదొక పెద్ద బోగస్‌ క్యాలెండరన్నారు. కార్యక్రమంలో తెలుగు యువత నాయకులతో పాటు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. పాలడుగు ప్రణీత్‌, ఉప్పాల కన్నా, వెనిగళ్ల గోపి, ఖుద్దూస్‌, కనక రాంబాబు, కుదరవల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


తెలుగు యువత నాయకుల అరెస్టు

సోమవారం తెలుగు యువత, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరుద్యోగులు తలపెట్టిన సి.ఎం కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని భగ్నం చేసే దిశలో భాగంగా ఆదివారం పట్టణంలో అరెస్టులు జరిగాయి.కొల్లూరు శ్రీధర్‌, కోట మార్కండేయులు, జితేష్‌, పూర్ణ, మల్లవరపు ప్రదీప్‌ తదితర నాయకులును అరెస్టు చేశారు.

Updated Date - 2021-07-19T13:37:50+05:30 IST