APPSC: శుభవార్త.. 190 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

ABN , First Publish Date - 2021-10-09T15:40:20+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌..

APPSC: శుభవార్త.. 190 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

ఏపీపీఎస్సీలో 190 అసిస్టెంట్‌ ఇంజనీర్లు

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ)... వివిధ ఇంజనీరింగ్‌ విభాగాల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.


మొత్తం ఖాళీల సంఖ్య: 190(క్యారీ ఫార్వర్డ్‌ ఖాళీలు-35, తాజా పోస్టులు-155)

విభాగాలు: సివిల్‌, ఈఎన్‌వీ, మెకానికల్‌

సర్వీసులు: ఏపీఆర్‌డబ్ల్యూఎస్‌ అండ్‌ ఎస్‌ ఇంజనీరింగ్‌ సబార్డినేట్‌ సర్వీస్‌, పీహెచ్‌ అండ్‌ ఎంఈ సబార్డినేట్‌ సర్వీస్‌, ఏపీ పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ఎంపీఎల్‌ ఇంజనీరింగ్‌ సబార్డినేట్‌ సర్వీస్‌, ఏపీ గ్రౌండ్‌ వాటర్‌ అండ్‌ సబార్డినేట్‌ సర్వీస్‌, ఏపీ పంచాయతీరాజ్‌ అండ్‌ రూరల్‌ డెవల్‌పమెంట్‌ సబార్డినేట్‌ సర్వీస్‌, ఎండోమెంట్‌ సబార్డినేట్‌ సర్వీస్‌, ఏపీ వాటర్‌ రిసోర్సెస్‌ సబార్డినేట్‌ సర్వీస్‌


అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా, బీఈ/బీటెక్‌/, ఎల్‌సీఈ/తత్సమాన ఉత్తీర్ణత.

వయసు: 2021 జూలై 01 నాటికి 18 నుంచి 42  ఏళ్ల మధ్య ఉండాలి

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష ఆధారంగా


పరీక్ష విధానం: ఈ పరీక్ష ఆబ్జెక్టివ్‌ టైప్‌లో ఉంటుంది. దీన్ని మొత్తం 300 మార్కులకు నిర్వహిస్తారు. పేపర్‌-1 జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ(డిగ్రీ స్థాయి), పేపర్‌-2 సివిల్‌/మెకానికల్‌(డిప్లొమా స్థాయి) నుంచి ప్రశ్నలు  ఉంటాయి. ఈ పరీక్షను ఇంగ్లీష్‌ మాధ్యమంలో నిర్వహిస్తారు. నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం అమల్లో ఉంది.

జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ - 150 ప్రశ్నలు- 150 నిమిషాలు- 150 మార్కులు

సివిల్‌/మెకానికల్‌(కామన్‌) - 150 ప్రశ్నలు- 150 నిమిషాలు- 150 మార్కులు

ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌(పోస్ట్‌ కోడ్‌ 3కి మాత్రమే) - 150 ప్రశ్నలు- 150 నిమిషాలు- 150 మార్కులు


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: అక్టోబరు 21

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: నవంబరు 11

వెబ్‌సైట్‌: https://psc.ap.gov.in/


Updated Date - 2021-10-09T15:40:20+05:30 IST