2021 ఓటర్ల జాబితాపై విచారణ వాయిదా

ABN , First Publish Date - 2021-01-27T19:07:11+05:30 IST

పంచాయతీ ఎన్నికలకు 2021 ఓటర్ల జాబితా పరిగణనలోకి తీసుకోవాలంటూ హైకోర్టులో వేసిన పిటిషన్‌‌పై

2021 ఓటర్ల జాబితాపై విచారణ వాయిదా

అమరావతి: పంచాయతీ ఎన్నికలకు 2021 ఓటర్ల జాబితా పరిగణనలోకి తీసుకోవాలంటూ హైకోర్టులో వేసిన పిటిషన్‌‌పై విచారణ గురువారానికి వాయిదా పడింది. తొలుత ఎల్లుండి విచారించాలని ధర్మాసనం భావించింది.  ఎల్లుండి నోటిఫికేషన్ వస్తుందని కోర్టుకు న్యాయవాదులు చెప్పడంతో.. విచారణను రేపటికి వాయిదా వేసింది. 


ఇదిలా ఉంటే, 2019 ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికల నిర్వహణ సరికాదని, హైకోర్టులో గుంటూరుకు చెందిన ధూళిపాళ్ల అఖిల పిటిషన్‌ వేశారు. కొత్త ఓటర్ల జాబితా ప్రకారం 2021 ఓట్ల జాబితా ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా చూడాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. 2019 జాబితాతో 3.60 లక్షల మంది యువ ఓటర్లకు అన్యాయం జరుగుతోందని, ఆర్టికల్ 326 ప్రకారం 18 ఏళ్లు దాటిన వారికి ఓటు హక్కు ఉందని పిటిషనర్‌ అంటున్నారు. 

Updated Date - 2021-01-27T19:07:11+05:30 IST