అదనపు రుణం అర్హతను కోల్పోయిన ఏపీ

ABN , First Publish Date - 2021-11-13T00:02:37+05:30 IST

అదనపు రుణం అర్హతను ఏపీ కోల్పోయింది. మూలధనం

అదనపు రుణం అర్హతను కోల్పోయిన ఏపీ

ఢిల్లీ: అదనపు రుణం అర్హతను ఏపీ కోల్పోయింది. మూలధనం వ్యయం లక్ష్యాలను చేరుకోవడంలో ఏపీ వెనకబడింది. రాష్ట్రంలో ఆస్తులను సృష్టించడంలో ఏపీ వెనకబడింది. దీంతో అదనపు రుణాన్ని ఏపీ పొందలేకపోయింది.  రెండో త్రైమాసికంలో మూలధనం వ్యయం లక్ష్యాలను చేరుకున్న 7 రాష్ట్రాలకు ఎఫ్‌ఆర్‌బీఎంకు అదనంగా 16,691 కోట్లు రుణం పొందేందుకు కేంద్ర ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. రూ.5392 కోట్ల అదనపు రుణం పొందేందుకు తెలంగాణకు అనుమతి ఇచ్చింది. అదనపు రుణం పొందేందుకు అర్హత పొందిన రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్‌, కేరళ, మధ్యప్రదేశ్‌, మేఘాలయ, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ ఉన్నాయి. 


Updated Date - 2021-11-13T00:02:37+05:30 IST