క్వారంటైన్‌ కేంద్రాల ఏర్పాటు

ABN , First Publish Date - 2020-04-04T10:07:26+05:30 IST

అవుకు ఏపీ మోడల్‌ స్కూల్‌లో క్వారంటైన్‌ కేం ద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్‌ సంజీవయ్య శుక్రవారం తెలిపారు.

క్వారంటైన్‌ కేంద్రాల ఏర్పాటు

అవుకు, ఏప్రిల్‌ 3: అవుకు ఏపీ మోడల్‌ స్కూల్‌లో క్వారంటైన్‌ కేం ద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్‌ సంజీవయ్య శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ 100 పడకలతో క్వారంటైన్‌ కేంద్రం ఏర్పా టుచేసి మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఎల్లా రాముడుకి అప్పగించామన్నారు. క్వారంటైన్‌లో కావాల్సిన మౌలిక సదుపా యాలు కల్పించామన్నారు. అవుకులో ఆరోగ్య కార్యకర్తలు, ఆశాలు, వలంటీర్లు బృందాలుగా ఏర్పడి ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ సర్వేలో దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్న వారిని గుర్తించి క్వారంటైన్‌కు తరలిస్తే వైద్యధికారులు పర్యవేక్షిస్తారని అన్నారు. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.


మద్దికెర: మండలంలో కరోనా వైరస్‌ లక్షణాలు ఉన్న వారి కోసం మద్దికెర గ్రామ ఆదర్శ పాఠశాలలో క్వారంటైన్‌ కేంద్రం సిద్ధం చేసినట్లు డిప్యూటీ తహసీల్దార్‌ నాగభూషణం శుక్రవారం తెలిపారు. తాత్కాలికంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు, కరోనా లక్షణాలు ఉన్న వారు విశ్రాంతి తీసుకునేందుకు 100 పడకలు ఏర్పాటు చేశామన్నారు. విదేశాల నుంచి ఎవరైనా వచ్చి ఉంటే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో వీఆర్వోలు రహిమాన్‌, రంగస్వామి పాల్గొన్నారు. 


కొత్తపల్లి: కరోనా వైరస్‌ నివారణ చర్యల్లో భాగంగా కొత్తపల్లి గ్రామ శివారులోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో క్వారంటైన్‌ ఏర్పాటు చేసినట్లు ఇన్‌చార్జి తహసీల్దార్‌ శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం తహసీల్దార్‌ తోపాటు ఎంపీడీవో చంద్రశేఖర్‌, మానిటరింగ్‌ అధికారి మనోజర్‌, వైద్యాధికారి వినోద్‌ కుమార్‌, ఎస్‌ఐ నవీన్‌బాబు ప్రారంభించారు. అనంతరం తహసీల్దార్‌ మాట్లాడుతూ మండల ప్రజలు భయాందోళనకు గురి కావద్దని అన్నారు. క్వారంటైన్‌లో కరోనా అనుమానిత కేసులు ఉంటే వైద్యుల పర్యవేక్షణలో వైద్యసేవలు అందిస్తారని అన్నారు. 


మిడుతూరు: మిడుతూరు ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు చేస్తున్న క్వారంటైన్‌ను శుక్రవారం ఎంపీడీవో జీఎన్‌ఎస్‌ రెడ్డి, ఈవోఆర్డీ పుల్లయ్య పరిశీలించారు. క్వారంటైన్‌లో కరోనా వైరస్‌ లక్షణాలు ఉన్నవారికి వైద్య పరీక్షలు చేస్తారని అన్నారు. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారు క్వారంటైన్‌కు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

Updated Date - 2020-04-04T10:07:26+05:30 IST