‘రిమ్స్‌ ఘటన’పై విచారణకు ద్విసభ్య కమిటీ

ABN , First Publish Date - 2020-08-13T07:14:12+05:30 IST

‘రిమ్స్‌ ఘటన’పై విచారణకు ద్విసభ్య కమిటీ

‘రిమ్స్‌ ఘటన’పై విచారణకు ద్విసభ్య కమిటీ

‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన 


ఒంగోలు(కార్పొరేషన్‌) ఆగస్టు 12: ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్‌లో వృద్ధుడి మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటనను ప్రభుత్వం సీరియ్‌సగా తీసుకుంది. దీనిపై విచారణకు ఆదేశిస్తూ ద్విసభ్య కమిటీని నియమించింది. సింగరాయకొండ మండలం కె.బిట్రగుంటకు చెందిన వృద్ధుడు కాంతారావు రిమ్స్‌కు వచ్చి మృతిచెందారు. మృతదేహం చెవులు, ముక్కును కుక్కలు పీక్కుతిన్న విషయమై ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన సంచికలో మంగళవారం కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన ప్రభుత్వం విజయవాడ, గుంటూరుకు చెందిన డాక్టర్‌ భాస్కర్‌, డాక్టర్‌ కిరణ్‌లతో ద్విసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీ సభ్యులు బుధవారం ఒంగోలు వచ్చి కాంతారావు మృతికి గల కారణాలపై రిమ్స్‌ అధికారులను విచారించారు. మరోవైపు కలెక్టర్‌ పోలా భాస్కర్‌ కూడా ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఇకపై కరోనా మృతుల వివరాలను ఆన్‌లైన్‌లో ప్రకటిస్తామని తెలిపారు. 

Updated Date - 2020-08-13T07:14:12+05:30 IST