భారీగా డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు

ABN , First Publish Date - 2020-08-13T07:20:38+05:30 IST

భారీగా డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు

భారీగా డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు

‘కిడారి’ వారసుడికి కేఆర్‌పురంలో పోస్టింగ్‌

విశాఖ రెవెన్యూను బలోపేతం చేసేదిశగా చర్యలు


అమరావతి, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): నక్సల్స్‌ చేతిలో హతమైన అరకు మాజీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుమారుడు సందీ్‌పకుమార్‌కు డిప్యూటీ కలెక్టర్‌గా మొదటి పోస్టింగ్‌ లభించింది. కేఆర్‌పురం ఐటీడీఏ పరిధిలో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా పోస్టింగ్‌ ఇస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తొలి పోస్టింగే రెవెన్యూ డివిజనల్‌ అధికారి (ఆర్‌డీఓ)గా పంపించాలని ప్రభుత్వం భావించింది. అయితే క్షేత్రస్థాయిలో మరింత పాలనా అనుభవం కావాలని, గిరిజన ప్రాంతాల్లో పనిచేసే అవకాశం కల్పించాలని ఆయన కోరినట్లు తెలిసింది. దీంతో ప్రభుత్వం... పూర్తి గిరిజన ప్రాంతమైన కేఆర్‌పురం ఐటీడీఏ డివిజన్‌ పరిధిలో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా పోస్టింగ్‌ ఇచ్చారు. మరో 36 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ, వెయిటింగ్‌లో ఉన్నవారికి పోస్టింగ్‌ ఇస్తూ సీఎస్‌ ఉత్తర్వులు ఇచ్చారు. ఇటీవల ప్రొబెషనరీ ఐఏఎ్‌సలకు సబ్‌కలెక్టర్‌ పోస్టులు ఇచ్చారు. దీంతో 12 మందిపైనే ఇటీవల బదిలీ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు వీరికి కూడా పోస్టింగ్‌ ఇచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీ చేయించుకొని ఆదర్శంగా నిలిచిన డిప్యూటీ కలెక్టర్‌ లక్ష్మి శివజ్యోతిని పాడేరు ఆర్‌డీఓగా బదిలీ చేశారు. శ్రీకాకుళం ఆర్‌డీఓగా ఐ.కిశోర్‌ను బదిలీచేశారు. కదిరి ఆర్‌డీఓగా కె. వెంకటరెడ్డి, ఆదోని ఆర్‌డీఓగా రామకృష్ణారెడ్డి, విజయనగరం ఆర్‌డీఓగా భవానీ శంకర్‌ను బదిలీ చేశారు. కృష్ణా జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్‌ఓ)గా ఉన్న ప్రసాద్‌ను విశాఖకు బదిలీచేశారు. అనంతపురం జేసీ 2గా గంగాధరమ్‌గౌడ్‌, నెల్లూరు జేసీ2గా టి. కృష్ణభారతి, ప్రకాశం జేసీ-2గా టి.బాపిరెడ్డి, జె. వెంకటరావును విజయనగరం జేసీ-2గా బదిలీచేశారు. రానున్న రోజుల్లో విశాఖ రెవెన్యూ అధికారుల్లో మరిన్ని బదిలీలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వం రెవెన్యూ జేసీగా వేణుగోపాల్‌రెడ్డిని నియమించింది. ఇప్పుడు డీఆర్‌ఓగా రెవెన్యూ అంశాల్లో నిపుణుడిగా పేరున్న ప్రసాద్‌ను నియమించింది. ఇంతకు ముందు రెవెన్యూలో ఓఎ్‌సడీగా పనిచేసి, ప్రస్తుతం టూరిజంలో స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న రామ్‌ప్రసాద్‌ను విశాఖ రెవెన్యూ విభాగంలో ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. విశాఖను కార్యనిర్వాహక రాజఽధానిగా ప్రకటించిన నేపథ్యంలో అక్కడ రెవెన్యూ అదికారుల బృందంలో నిపుణులు, చట్టాలపై అవగాహన ఉన్నవారు ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. 

Updated Date - 2020-08-13T07:20:38+05:30 IST