Abn logo
Nov 28 2020 @ 04:03AM

పింఛా’ప్రాజెక్టుకు గండి

‘చిత్తూరు జిల్లాలో గురువారం రాత్రి కురిసిన భారీవర్షాలకు కడప జిల్లా టి.సుండుపల్లి మండలంలో బాహుదా నదిపై నిర్మించిన పింఛా ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. డ్యాం క్రస్ట్‌గేట్లు సామర్థ్యం 58వేల క్యూసెక్కులు. ఎగువనుంచి 1.50 లక్షల క్యూసెక్కులకు పైగా వరద రావడంతో ఆనకట్టపై సుమారుగా 7.5 అడుగులు ఎత్తులో వరద ప్రవహించింది. ఆ ఉధృతికి డ్యాం కుడివైపున ఉన్న మట్టి ఆనకట్ట 120-150 మీటర్లకు పైగా అడ్డంగా కోతకు గురయింది. గేట్లకు పెద్ద చెట్లు అడ్డంపడ్డాయి. శాశ్వత మరమ్మతులకు రూ.17-20 కోట్లు అవసరమని మైనర్‌ ఇగిరేషన్‌ ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. 

Advertisement
Advertisement
Advertisement