ఐదుగురు రోగుల దుర్మరణం
అహ్మదాబాద్, నవంబరు 27: గుజరాత్‌లోని కొవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుని, ఐదుగురు కరోనా పేషెంట్లు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన రాజ్‌కోట్‌లోని శివానంద్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. శుక్రవారం తెల్లవారుజామున ఆస్పత్రి మొదటి అంతస్తులో ఉన్న ఐసీయూలోని ఓ వెంటిలేటర్లో సంభవించిన షార్ట్ సర్క్యూట్‌తో మంటలు వ్యాప్తి చెందాయి. ఆ సమయంలో ఐసీయూలో 11 మంది, ఇతర వార్డుల్లో మరో 20 మంది రోగులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణంపాలైనట్లు రాజ్‌కోట్ పోలీసు కమిషనర్ మనోజ్ అగర్వాల్ వెల్లడించారు. మిగతా 26 మందిని అగ్నిమాపక సిబ్బంది కాపాడిందని చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున నష్టపరిహారం అందజేస్తామని గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ప్రకటించారు. కాగా.. ఈ ప్రమాదంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. సుమోటోగా కేసును విచారణకు స్వీకరించింది. జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్్సరెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం ఈ ఘటనను ‘‘చాలా తీవ్రమైనది’’ అని అభివర్ణించింది. ఈ దుర్ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్‌గాంధీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.