కూరగాయల షాపు యజమానిపై దాడికి యత్నం

ABN , First Publish Date - 2021-09-18T22:31:05+05:30 IST

కూరగాయల షాపు యజమానిపై దాడికి యత్నం

కూరగాయల షాపు యజమానిపై దాడికి యత్నం

పశ్చిమగోదావరి: జిల్లాలోని పాలకొడేరు మండలం పెట్రోల్ బంకు వద్ద దారుణ ఘటన చోటుచేసుకుందది. కూరగాయల షాపు యజమానిపై దాడి చేసేందుకు ఇద్దరు యువకులు ప్రయత్నించారు. దాడి చేస్తుండగా యువకులను పట్టుకుని స్థానికులు కట్టేసారు. యువకులు వద్ద ఉన్న కత్తి రెండు రాడ్లు ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. పాత గొడవల నేపథ్యంలో కూరగాయల షాపు యజమాని సత్యనారాయణ పై శేఖర్ అనే వ్యక్తి దాడికి పంపినట్లు యువకులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2021-09-18T22:31:05+05:30 IST