Abn logo
Sep 22 2021 @ 16:04PM

ఆయేషా మీరా హత్య కేసులో సీబీఐ పిటిషన్ కొట్టేసిన కోర్టు

విజయవాడ: ఆయేషా మీరా హత్య కేసులో సీబీఐ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. నిందితులకు నార్కో ఎనాలసిస్ పరీక్షలు నిర్వహించాలని సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. మొత్తం ఏడుగురు నిందితులకు పరీక్షలు నిర్వహించాలని  సీబీఐ కోరింది. నిందితుల తరపున న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ వాదనలు వినిపించారు. సీబీఐ పిటిషన్‌ను విజయవాడ కోర్టు డిస్మిస్‌ చేసింది.