రెండు గ్రాముల బంగారం.. పట్టుచీర!

ABN , First Publish Date - 2022-05-22T08:43:11+05:30 IST

రెండు గ్రాముల బంగారం.. పట్టుచీర!

రెండు గ్రాముల బంగారం.. పట్టుచీర!

గెలిపించారన్న కృతజ్ఞతతో సర్పంచ్‌.. పెళ్లికానుక


కాళ్ళ, మే 21: సర్పంచ్‌ ఎన్నికల్లో తనను మహిళల ఓట్లే గెలిపించాయని.. దీనికి కృతజ్ఞతగా గ్రామంలో ఏ ఆడబిడ్డ వివాహం జరిగినా తన తోబుట్టువుగా భావిస్తూ పెళ్లి కానుక అందజేస్తూ  గ్రామస్థుల ప్రశంసలు అందుకుంటున్నారు పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం ఎస్సీ బోస్‌ కాలనీ సర్పంచ్‌ మంతెన శ్రీనివాసరాజు. 2021లో జరిగిన సర్పంచ్‌ ఎన్నికల్లో తెలుగుదేశం అనుకూల అభ్యర్థిగా ఆయన బరిలో నిలిచి విజయం సాధించారు. గ్రామంలో మహిళలు ఓట్లు వేయడం వల్లే తాను గెలిచానని భావించిన ఆయన గ్రామంలో ఏ ఆడపిల్ల వివాహం జరిగినా కులమతాలకు అతీతంగా రెండు గ్రాముల బంగారు మంగళ సూత్రాలు, పెళ్లి పట్టుచీర, గాజులు, పువ్వులు, పసుపు-కుంకుమతో పాటు రూ.2వేల నగదు అందజేస్తున్నారు. సర్పంచ్‌గా గెలిచిన నాటి నుంచి ఇప్పటి వరకు 14 మంది నవ వధువులకు పెళ్లి కానుక అందించారు. ఈ క్రమంలోనే శనివారం గ్రామానికి చెందిన మోకా హరిబాబు, వెంకటలక్ష్మి దంపతుల కుమార్తె లక్ష్మి వివాహం సందర్భంగా పెళ్లి కానుక అందించారు.

Updated Date - 2022-05-22T08:43:11+05:30 IST