ఘాట్‌ రోడ్డులో అదుపుతప్పిన జీపు

ABN , First Publish Date - 2021-11-29T09:15:11+05:30 IST

ఘాట్‌ రోడ్డులో అదుపుతప్పిన జీపు

ఘాట్‌ రోడ్డులో అదుపుతప్పిన జీపు

20 అడుగుల దిగువకు దూసుకుపోవడంతో 15 మందికి తీవ్ర గాయాలు

ఇద్దరి పరిస్థితి ఆందోళనకరం

ధారాలమ్మ దర్శనానికి వెళ్లి వస్తుండగా ఘటన


గూడెంకొత్తవీధి/ సీలేరు (విశాఖ జిల్లా), నవంబరు 28: విశాఖ ఏజెన్సీలోని జీకేవీధి మండలం ధారాలమ్మ ఘాట్‌రోడ్డులో జీపు అదుపు తప్పి లోయలోకి దూ సుకుపోయింది. ఈ ఘటనలో 15 మంది కి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. దీనికి సంబంధించి ప్రత్యక్ష సాక్షులు, క్షతగాత్రులు తెలిపిన వివరాలు... జి.మాడుగుల మండలం గడుతూరు గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన 15 మంది గిరిజనులు ఆదివారం ధారకొండలోని ధారాలమ్మ అమ్మవారి దర్శనానికి జీపులో వచ్చారు. అమ్మవారి దర్శనం అనంతరం సాయంత్రం స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. ధారకొండ ఘాట్‌ దిగుతుండగా జీపు అదుపుతప్పి పక్కనే 20 అడుగుల లోయలోకి దూసుకుపోయింది. దీంతో జీపులో ప్రయాణిస్తు న్న వారంతా తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని 108కు సమాచారమిచ్చారు. అంబులెన్స్‌ వచ్చేలోగా క్షతగాత్రులను ప్రైవేటు వాహనాల్లో చింతపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. గాయపడిన వారిలో పార్వతమ్మ, పోతురాజుల పరిస్థితి విషమంగా ఉండడంతో, ప్రాథమిక చికిత్స అనంతరం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మిగిలిన వారికి చింతపల్లిలోనే చికిత్స  అందిస్తున్నారు. 

Updated Date - 2021-11-29T09:15:11+05:30 IST