రాష్ట్ర కమిటీ సమావేశాలలో నిర్ణయాలు ఇవే

ABN , First Publish Date - 2022-03-11T01:14:17+05:30 IST

రాష్ట్ర కమిటీ సమావేశాలలో నిర్ణయాలు ఇవే

రాష్ట్ర కమిటీ సమావేశాలలో నిర్ణయాలు ఇవే

అమరావతి: ఆంధ్రప్రదేశ్ పంచాయితీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ సమావేశాలు జరిగాయి. 9 , 10 తేదీలలో జరిగిన సమావేశాలలో పలు తీర్మానాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వైవీబీ రాజేంద్రప్రసాద్ మాట్లాడారు. రాష్ట్రంలోని 12,918 గ్రామ పంచాయితీల సర్పంచ్ ల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించామన్నారు. అలాగే ఆందోళనా కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానాలు చేశామని తెలిపారు. రాష్ట్రంలోని గ్రామ సర్పంచ్‌లు రాజకీయాలకతీతంగా ఈ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు. డిమాండ్ల సాధన కోసం  రాజీలేని పోరాటాల్ని చేయాలని నిర్ణయించామని స్పష్టం చేశారు. 11 వ తేదీన  సర్పంచ్‌లు 13 జిల్లాలోను జిల్లా కలెక్టర్లకు 15 డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మెమొరాండం అందిస్తారని పేర్కొన్నారు. 175 అసెంబ్లీ  నియోజకవర్గ స్థాయి సర్పంచ్‌ల సంఘం కమిటీలను ఎన్నుకోవాలన్నారు. ఏప్రిల్ నెల మొదటి వారం నుంచి కలెక్టరేట్ల ముందు సర్పంచుల ధర్నా లు చేస్తారని తెలిపారు. అలాగే జిల్లాల వారీగా ధర్నాల తేదీలను వారంలో నిర్ణయించి ప్రకటిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిస్పందనను బట్టి భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకుంటామని వెల్లడించారు.

Updated Date - 2022-03-11T01:14:17+05:30 IST