Abn logo
Sep 25 2021 @ 03:06AM

జస్టిస్‌ ఉమాదేవి సేవలు అభినందనీయం

చీఫ్‌ జస్టిస్‌ ఏకే గోస్వామి

అమరావతి, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉమాదేవి సేవలు అభినందనీయమైనవని చీఫ్‌ జస్టిస్‌ అరూ్‌పకుమార్‌ గోస్వామి కొనియాడారు. ఆమె శనివారం పదవీ విరమణ చేయనున్నారు. ఆ రోజు సెలవు కావడంతో శుక్రవారమే ప్రధాన న్యాయమూర్తి కోర్టు హాల్లో.. ఫుల్‌కోర్టు ఆధ్వర్యంలో ఆమెకు వీడ్కోలు సభ నిర్వహించారు. 1996లో జిల్లా న్యాయమూర్తిగా నేరుగా నియామకం పొంది, 2017లో హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్‌ ఉమాదేవి రెండు దశాబ్దాలుగా న్యాయవ్యవస్థకు అందించిన సేవలు ప్రశంసనీయమని చీఫ్‌ జస్టిస్‌ కొనియాడారు. ఆమె విశ్రాంత జీవితం ప్రశాంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. జ్యుడీషియల్‌ అధికారిగా సేవలందించటంలో సహకరించిన అందరికీ జస్టిస్‌ ఉమాదేవిప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు అడ్వొకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరామ్‌, హైకోర్టు అడ్వొకేట్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు వె.ౖవి. రవిప్రసాద్‌, బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ గంటా రామారావు, అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఎన్‌.హరినాథ్‌.. జస్టిస్‌ ఉమాదేవి సేవలను కొనియాడారు. వీడ్కోలు సభలో న్యాయమూర్తులు, రిజిస్ట్రార్లు, బార్‌ అసోసియేషన్‌ సభ్యులు పాల్గొన్నారు.