Abn logo
Sep 25 2021 @ 03:09AM

తెలుగు రాష్ట్రాలకు ఉత్తరాది విద్యార్థులు

అఖిల భారత సర్వీసుల కోసం శిక్షణ

అమరావతి, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): ఉత్తరాదికి చెందిన విద్యార్థులు పలువురు అఖిల భారత సర్వీసుల(సివిల్స్‌) శిక్షణ కోసం తెలుగు రాష్ట్రాలకు వస్తుండడం విశేషం. ఈ ఏడాది సివిల్స్‌లో 164వ ర్యాంకు సాధించిన రోహన్‌జా.. డాక్టర్‌ లక్ష్మయ్య ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందారు. ఈయన హరియాణ రాష్ట్ర అదనపు చీఫ్‌ సెక్రటరీ కుమారుడు. రెండేళ్ల క్రితం సివిల్స్‌లో ఏడో ర్యాంకు సాధించిన ఆయుష్‌ సిన్హా హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమారుడు కావడం విశేషం. ఆయన కూడా తమ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందారని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. మొత్తంగా తమ సంస్థలో కోచింగ్‌ తీసుకున్నవారిలో ఐదుగురికి వెయ్యిలోపు ర్యాంకులు వచ్చాయన్నారు. మరోవైపు బాలలత ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందిన శ్రీజకు 20వ ర్యాంకు వచ్చింది. దీంతో పాటు ఐదువందల లోపు ర్యాంకులు రెండు, వెయ్యిలోపు ర్యాంకులు నాలుగు సాధించినట్లు బాలలత తెలిపారు. 

డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌కు నోటిఫికేషన్‌

డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. డీసెట్‌ కన్వీనర్‌ రవీంధ్రనాథ్‌రెడ్డి శుక్రవారం ఈ మేరకు నోటిఫికేషన్‌ జారీ చేశారు.