Abn logo
Sep 27 2021 @ 02:47AM

తప్పుడు ఆరోపణలపై పరువు నష్టం: సామినేని

‘‘తెలంగాణ సరిహద్దులో పట్టుబడ్డ మాదక ద్రవ్యాల కేసులో నాకూ, నా కుమారుడికి ప్రమే యం ఉందంటూ ప్రచారం చేస్తున్నవారిపై పరువు నష్టం కేసు వేస్తున్నా. ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశాను. టీడీపీ నాయకుడు, నెలవారీ జీతాగాడు పట్టాభి నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేదిలేదు’’ అని ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను హెచ్చరించారు. ‘‘నార్కో ఎనాలసిస్‌ టెస్టులకు రావాలని పట్టాభి సవాల్‌ చేశారు. ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు, ఆయన కుటుంబం వస్తే నేనూ వస్తా’’ అని ఉదయభాను అన్నారు.