Abn logo
Sep 27 2021 @ 02:59AM

అప్పన్న సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తులు

సింహాచలం, సెప్టెంబరు 26: ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో వరాహ లక్ష్మీనృసింహస్వామిని ఆదివారం హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ డీవీ సోమయాజులు, జస్టిస్‌ డీ.రమేశ్‌, జస్టిస్‌ కే.విజయలక్ష్మి, జస్టిస్‌ ఆర్‌.రఘునందనరావు, జస్టిస్‌ ఎం.గంగారావు దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో విచ్చేసిన వీరికి దేవస్థానం ఈవో ఎంవీ సూర్యకళ ఆలయ లాంఛనాలతో ఆహ్వానం పలికారు. కప్పస్తంభం ఆలింగనం తర్వాత వారి గోత్రనామాలతో అర్చకులు పూజలు చేశారు.  ఆలయ పండితులు వేదాశీర్వచనాలివ్వగా, అధికారులు స్వామివారి ఫొటోను, ప్రసాదాలను అందజేశారు.