Abn logo
Sep 27 2021 @ 03:03AM

వెన్నెముక చికిత్సలో కొత్త సిద్ధాంతం

గుంటూరు వైద్యుడికి అంతర్జాతీయ ఖ్యాతి

వెన్నునొప్పి వైద్యంలో కచ్చితత్వానికి ఆస్కారం

గుంటూరు (మెడికల్‌), సెప్టెంబరు 26: గుంటూరుకు చెందిన స్పైన్‌ సర్జన్‌ డాక్టర్‌ జే నరేశ్‌బాబుకు అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. వయోజన వెన్ను వైకల్య చికిత్సల్లో  ఏఎ్‌సడీ వర్గీకరణపై ఆయన ప్రతిపాదించిన నూతన థియరీ అత్యుత్తమైనదిగా పది మందితో కూడిన అంతర్జాతీయ వైద్యనిపుణుల బృందం నిర్ధారించింది. దీనివల్ల చికిత్సల్లో కచ్చితత్వం పెరగడంతో పాటు అనవసర చికిత్సలకు ఆస్కారం ఉండదని వివరించారు. 2019లో ఈ వ్యాసం ఏషియన్‌ స్పైన్‌ జర్నల్‌లో ప్రచురితమైంది. వెన్ను నొప్పి చికిత్సల్లో నూతన ప్రామాణికాల నిర్ధారణ కోసం స్విట్జర్లాండ్‌కు చెందిన ఏవో స్పైన్‌ సంస్థ, ఏవో నాలెడ్జ్‌ ఫోరం డిఫార్మిటీ సంస్థ నరేశ్‌బాబు మరింత లోతైన పరిశోధన చేసేందుకు 10 లక్షల డాలర్లు నగదును మంజూరు చేశాయి. మూడేళ్ల పాటు సాగిన ఈ పరిశోధన ఇటీవల ముగిసింది. సెప్టెంబరు 24న వర్చువల్‌ పద్ధతిలో జరిగిన అంతర్జాతీయ వైద్య సదస్సులో నరేశ్‌బాబు తన పరిశోధన అంశాలను వెల్లడించారు. దీనికి సర్వత్రా ఆమోదం వ్యక్తమైంది. కొత్తపేటలోని మల్లిక స్పైన్‌ సెంటర్‌లో ఆదివారం జరిగిన విలేకర్ల సమావే శంలో నరేశ్‌బాబు ఆ వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది చివరిలో ప్యారి్‌సలో జరిగే మరో అంతర్జాతీయ సదస్సులో దీనిపై తుది సారి చర్చించి కొత్త ఏఏ్‌సడీ మార్గదర్శకాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉందని చెప్పారు.