Abn logo
Oct 17 2021 @ 03:39AM

సిద్ధిదాయినిగా భ్రమరాంబ దర్శనం

శ్రీశైలం, అక్టోబరు 16: శ్రీశైలంలో దసరా మహోత్సవాల సందర్భంగా విజయదశమి రోజున స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు జరిపారు. అమ్మవారికి సిద్ధిదాయని అలంకారం చేశారు. అశ్వవాహనంపై స్వామి అమ్మవార్లను ఊరేగించారు. సాయంత్రం అమ్మవారు భ్రమరాంబ అలంకారంలో దర్శనమిచ్చారు. పుష్కరిణిలో తెప్పోత్సవం నిర్వహించారు.