56 ఏళ్ల మహిళ అండాశయంలో 47 కిలోల కణితి

ABN , First Publish Date - 2022-02-16T07:40:13+05:30 IST

56 ఏళ్ల మహిళ అండాశయంలో 47 కిలోల భారీ కణితిని అహ్మదాబాద్‌ అపోలో ఆస్పత్రి వైద్యులు తొలగించారు. ...

56 ఏళ్ల మహిళ అండాశయంలో 47 కిలోల కణితి

 సర్జరీ చేసి తొలగించిన అహ్మదాబాద్‌ అపోలో ఆస్పత్రి వైద్యులు

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): 56 ఏళ్ల మహిళ అండాశయంలో 47 కిలోల భారీ కణితిని అహ్మదాబాద్‌ అపోలో ఆస్పత్రి వైద్యులు తొలగించారు. దేశంలో తొలగించిన అతి పెద్ద అండాశయ కణితి ఇదేనని వెల్లడించారు. ఈ కణితి వల్ల 18 ఏళ్లుగా బాధపడుతున్న ఆ మహిళ ఇటీవల మంచానికి పరిమితమైంది. ఆమె శరీర బరువు అసాధారణ స్థాయికి చేరింది. జనవరి 27న 8మంది వైద్య బృందం సర్జరీ నిర్వహించి కణితితో పాటు, 7 కిలోల అదనపు చర్మాన్ని తొలగించింది. 

Updated Date - 2022-02-16T07:40:13+05:30 IST