వైసీపీ పాలనలో అప్పులు ఫుల్.. అభివృద్ధి నిల్: తులసిరెడ్డి

ABN , First Publish Date - 2020-12-04T21:52:40+05:30 IST

వైసీపీ ప్రభుత్వంపై ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనలో అప్పులు ఫుల్.. అభివృధి నిల్ అని విమర్శించారు. సంక్షేమం సంక్షోభంలో పడిందని వ్యాఖ్యానించారు

వైసీపీ పాలనలో అప్పులు ఫుల్.. అభివృద్ధి నిల్: తులసిరెడ్డి

అమరావతి: వైసీపీ ప్రభుత్వంపై ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనలో అప్పులు ఫుల్.. అభివృద్ధి నిల్ అని విమర్శించారు. సంక్షేమం సంక్షోభంలో పడిందని వ్యాఖ్యానించారు. అమ్మఒడి, చేయూత, ఆసరా డబ్బులు నాన్న బుడ్డికి సరిపోక తాళిబొట్టు తాకట్టు పెడుతున్నారని ఎద్దేవా చేశారు.  2019-20 వ్యవసాయ రంగానికి బడ్జెట్ రూ.18328కోట్లకు రూ.6549కోట్ల మాత్రమే రాష్ట్రం కేటాయించిందని తెలిపారు. సాగునీటి రంగానికి కేటాయించిన బడ్జెట్ రూ.13139 కోట్లకు రూ.4998 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని పేర్కొన్నారు. వైసీపీ 18 నెలల పాలనలో లక్ష నలభై వేల కోట్లు అప్పుచేసిందని తులసిరెడ్డి చెప్పుకొచ్చారు.

Updated Date - 2020-12-04T21:52:40+05:30 IST