Advertisement
Advertisement
Abn logo
Advertisement

రోడ్డు మరమ్మతులు చేస్తున్న ఏపీ పోలీసులు

కృష్ణా జిల్లా: పోలీసులు రోడ్ల దుస్థితిపై దృష్టి పెట్టారు. గుంతలమయంగా మారి ప్రమాదాలకు కారణమవుతున్న రోడ్లను మరమ్మతులు చేసే పనిలో పడ్డారు. నూజివీడు నియోజకవర్గంలో ఇటీవల రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. రోడ్లు అధ్వాహ్నంగా మారడంతో ప్రమాదాలు సాధారణంగా మారాయి. దీంతో పోలీసులు మరమ్మతు పనులు చేపట్టారు. నూజివీడు, విస్సన్నపేట, ఆగిరిపల్లి, మైలవరం మండలాల్లో ఆర్ అండ్ బీ బాధ్యతలను ఇప్పుడు పోలీసులు తమ భుజాలపై వేసుకున్నారు. పార పట్టుకుని సిమెంట్ పనులు చేస్తున్నారు. ఈ పనులు చూసి సీఎం జగన్ పాలనలో పోలీసులకు ఇదేం దుస్థితి అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం ఉన్నతాధికారుల మెప్పు కోసం పోలీసులు పనిచేస్తున్నారని చెబుతున్నారు. ఏది ఏమైనా ప్రమాదాలు జరగకుండా పోలీసులు చేస్తున్న శ్రమ దానాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.

Advertisement
Advertisement