ఉమాపై కేసు నమోదుపై పోలీసుల తర్జనభర్జన

ABN , First Publish Date - 2021-01-19T19:44:51+05:30 IST

దేవినేని ఉమాను అదుపులోకి తీసుకున్న పోలీసులు పమిడిముక్కల పీఎస్‌కు తరలించారు.

ఉమాపై కేసు నమోదుపై పోలీసుల తర్జనభర్జన

విజయవాడ: గొల్లపూడి సెంటర్‌లో హై డ్రామాల మధ్య తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమాను అదుపులోకి తీసుకున్న పోలీసులు పమిడిముక్కల పీఎస్‌కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్‌ వద్దకు భారీగా చేరుకుంటున్నారు. అయితే ఇవాళ సాయంత్రం వరకు ఉమాను స్టేషన్లోనే ఉంచే అవకాశం కనిపిస్తోంది. ఆయనపై కేసు నమోదు చేయాలా..వద్దా అనే అంశంపై పోలీసులు తర్జన భర్జన పడుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు. 


ఒకవేళ కేసు నమోదు చేస్తే ఈ రోజు రాత్రి పోలీస్ స్టేషన్లో ఉంచి, బుధవారం కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉన్నట్లు సమాచారం.


గొల్లపూడి సెంటర్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. మంత్రి కొడాలి నాని సవాల్‌కు ప్రతి సవాల్‌గా టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా దీక్షకు యత్నించగా దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకుని, అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

Updated Date - 2021-01-19T19:44:51+05:30 IST