Abn logo
Oct 27 2021 @ 17:15PM

పోలీసు దురాగతాలు దారుణంగా ఉన్నాయి: రఘురామ

ఢిల్లీ: పోలీసు దురాగతాలు దారుణంగా ఉన్నాయని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 41A నోటీసు ఇవ్వకుండా అరెస్టులు చేస్తున్నారని తప్పుబట్టారు. వైఎస్సార్ భరోసా కింద 13,500 వేలు ఇస్తున్నామని ఏపీ ప్రభుత్వం అంటోంది. కేంద్రం కూడా రైతులకు పీఎం కిసాన్ పేరిట ఏడాదికి 6 వేలు ఇస్తోంది. మా ప్రభుత్వం ఇస్తుంది రూ.7,500 మాత్రమే. నిస్సిగ్గుగా మొత్తం మేమే ఇస్తున్నామని మా ప్రభుత్వం చెబుతోంది. స్థల దాహంతో ఎయిడెడ్ స్కూల్స్‌ను సొంతం చేసుకుంటున్నారు. ఏ అధికారంతో ఎయిడెడ్ విద్యాసంస్థలను తీసుకుంటున్నారు. కోర్టుకు పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. కోర్టును తప్పుదోవ పట్టించారు. విశాఖలో నాలుగు స్కూల్స్ వాళ్ళు మూసివేస్తామన్నారు. మనం ఇచ్చే అమ్మఒడి ఏ మూలకూ సరిపోదు. ఎయిడెడ్ స్కూల్స్ జోలికి వెళ్లొద్దు’’ అని రఘురామకృష్ణరాజు సూచించారు.


ఇవి కూడా చదవండిImage Caption