ఆక్సిజన్ కొరత మరణాలపై కేంద్రానికి ఏపీ నివేదిక

ABN , First Publish Date - 2021-08-11T18:27:13+05:30 IST

ఆక్సిజన్ కొరత కారణంగా కొందరు చనిపోయారంటూ కేంద్రానికి ఏపీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది.

ఆక్సిజన్ కొరత మరణాలపై కేంద్రానికి ఏపీ నివేదిక

అమరావతి: ఆక్సిజన్ కొరత కారణంగా కొందరు చనిపోయారంటూ కేంద్రానికి ఏపీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈ మేరకు ఒక నివేదిక పంపింది. రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత కారణంగా కొద్ది నెలల క్రితం పలువురు చనిపోవడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రాణవాయువు కొరత.. మరణాలకు సంబంధించిన వివరాలను కేంద్రానికి ఏపీ సర్కార్ తెలిపినట్లు సమాచారం. దాంతో ఆక్సిజన్ కొరత మరణాలను అంగీకరించిన తొలి రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ప్రాణవాయువు అందక దేశంలో పలు రాష్ట్రాల్లో ఇదే తరహా ఘటనలు జరిగాయి. అయితే ఆక్సిజన్ కొరతవల్ల మరణాలు సంభవించినట్లు రాష్ట్రాలు తమ దృష్టికి తీసుకురాలేదంటూ ఇటీవలే కేంద్రం వెల్లడించింది. కేంద్రం ప్రకటనపై విపక్షాలు మండిపడ్డాయి. ఈ క్రమంలో ఆక్సిజన్ కొరత మరణాలపై నివేదిక ఇవ్వాలంటూ రాష్ట్రాలను కేంద్రం కోరింది. దీనిపై స్పందించిన ఏపీ.. నివేదిక పంపింది.

Updated Date - 2021-08-11T18:27:13+05:30 IST