Abn logo
Sep 23 2021 @ 00:34AM

లేపాక్షి రకం వేరుశనగ సాగును ప్రోత్సహిద్దాం

ఏపీ సీడ్స్‌ ఎండీ శేఖర్‌బాబు

అనంతపురం వ్యవసాయం, సెప్టెంబరు 22: జిల్లాలో లేపాక్షి రకం వేరుశనగ సా గును మరింతగా ప్రో త్సహిద్దామని ఏపీసీడ్స్‌ ఎండీ శేఖర్‌బాబు ఆదేశించారు. బుధవారం రెండో రోజు కదిరి మండలం రాజలపాలెం, నల్లచెరువు మండలం చెవిటివారిపల్లిలో లేపాక్షి రకం వేరుశనగ (కదిరి-1812) సాగును ఎండీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లేపాక్షి రకం వేరుశనగ మంచి దిగుబడి వస్తుందన్నారు. ఈ రకం పంట ను ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్దతు ధరతో కొనుగోలు చేసేలా చూస్తామన్నారు. పంటను ఆశించిన స్థాయిలో సాగు చేస్తే వచ్చే సర్టిఫైడ్‌ సీడ్‌ కింద పంపిణీ చేసి, తిరిగి రైతుల నుంచి కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయాలను క్షేత్ర స్థాయిలో రైతులకు తెలియజేసి, అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కదిరిలో ఎమ్మెల్యే సిద్దారెడ్డిని మ ర్యాదపూర్వకంగా కలిసి, లేపాక్షి రకం వేరుశనగ సాగు, తదితర అంశాలపై ఆయన చర్చించారు. కార్యక్రమంలో ఏపీసీడ్స్‌ జిల్లా మేనేజర్‌ ధనలక్ష్మి పాల్గొన్నారు.