Abn logo
Oct 26 2021 @ 14:09PM

జగన్‌కు మాట ఇవ్వటమే తప్ప...మడప తిప్పటం తెలియదు: Tammineni

శ్రీకాకుళం: దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉచిత విద్యుత్ అంటే బట్టలు ఆరబెట్టుకోవటమే అన్నారని...అసలు వ్యవసాయమే దండగ అన్నారని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఈరోజు రైతు భరోసా క్రింద జగన్ గొప్ప పధకాలు అందిస్తున్నారని తెలిపారు. జగన్‌కు మాట ఇవ్వటమే తప్ప మాట తప్పడం, మడమ తిప్పటం తెలియదని అన్నారు.  అదే ప్రతిపక్షాల కడుపుమంట అని వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వంలో మధ్యవర్తులు, దళారులు, జన్మభూమి కమిటీలు వంటివి లేవన్నారు. నేరుగా రైతులకు లబ్ది చేస్తున్నామని స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption