Abn logo
Sep 14 2021 @ 19:27PM

అలసత్వం వద్దు

అమరావతి: బడ్జెట్ అంచనాల మేరకు పన్ను వసూలు చేయాలని అధికారులతో స్పెషల్‌ సీఎస్‌ రజత్ భార్గవ అన్నారు. జీఎస్టీపై అధికారులతో స్పెషల్‌ సీఎస్‌  సమావేశం నిర్వహించారు. ఆదాయ వనరులు సమకూర్చడంలో అలసత్వం వహిస్తే సహించమన్నారు. పెట్రోల్, డీజిల్, లిక్కర్, సౌరవిద్యుత్ పరికరాలు, సౌరవిద్యుత్ ప్లాంట్లకు జీఎస్టీపై సమావేశంలో చర్చ జరిగింది. 17న లక్నోలో జరిగే జీఎస్టీ సమావేశానికి పన్ను వసూళ్లపై నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను రజత్ భార్గవ ఆదేశించారు. పన్నుల వసూళ్లలో మెరుగైన ఫలితాల కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులకు రజత్ భార్గవ సూచించారు. 

క్రైమ్ మరిన్ని...