మనోధైర్యాన్ని కోల్పోవద్దు

ABN , First Publish Date - 2021-05-05T04:47:23+05:30 IST

రోనా బారిన పడ్డ పోలీసులు మనోధైర్యాన్ని కోల్పోవద్దని ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌ సూచించారు.

మనోధైర్యాన్ని కోల్పోవద్దు
వీడియో కాన్ఫరెన్స్‌లో సూచనలు చేస్తున్న ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌

- ఎస్పీ రంజన్‌రతన్‌కుమార్‌

- పోలీసు సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్‌

గద్వాలక్రైం, మే 4 : కరోనా బారిన పడ్డ పోలీసులు మనోధైర్యాన్ని కోల్పోవద్దని ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌ సూచించారు. జిల్లాలో కొవిడ్‌ బారిన పడ్డ పోలీస్‌ సిబ్బందితో మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వారికి మనోధైర్యాన్ని కల్గించి, త్వరగా కోలుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు ఇచ్చారు. వైరస్‌ సోకినవారు మానసిక ఒత్తిడికి లోనుకావద్దన్నారు. జాగ్రత్తగా ఉంటూ పౌష్టికాహారం తీసుకోవాలని చెప్పారు. గుడ్లు, నాన్‌వెజ్‌ తరచుగా తీసుకోవడంతో పాటు డ్రైప్రూట్స్‌ ఎక్కువగా తినాలన్నారు. వైరస్‌ సోకిన కుటుంబసభ్యులకు దూరంగా ప్రత్యేకగదిలో ఉండాలన్నారు. ప్రాణాయామం చేయాలని సూచించారు. అలాగే కరోనా తగ్గిన తర్వాత సీటీ స్కాన్‌ను చేయంచుకోవాలని సూచించారు. ఎవరికైనా సీరియస్‌గా ఉంటే వెంటనే తమకు సమాచారం అందించాలని చెప్పారు. వారికి వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కాన్పరెన్స్‌లో సిబ్బంది ఉన్నారు.


కరోనాపై అప్రమత్తంగా ఉండాలి

కరోనా సెకండ్‌వేవ్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌ పట్టణ ప్రజలకు సూచించారు. గద్వాల పట్టణంలోని  గాంధీచౌక్‌, నూర్‌ మసీద్‌, రాజవీధి, కాలేజి రోడ్డు, వైఎస్‌ఆర్‌ చౌక్‌లలో మంగళవారం రాత్రి ఆయన కాలినడకన పర్యటించారు. దుకాణాలు, టీకొట్ల వద్ద గుంపులు గుంపులుగా ఉన్న ప్రజలతో మాట్లాడారు. కొవిడ్‌ నిబంధనలు పాటించాలని సూచించారు. లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఎస్పీ యాదగిరి, పట్టణ ఎస్‌ఐలు హరిప్రసాద్‌రెడ్డి, రమాదేవి, ట్రాఫిక్‌ ఎస్‌ఐలు విక్రమ్‌, విజయభాస్కర్‌ ఉన్నారు. 


Updated Date - 2021-05-05T04:47:23+05:30 IST