కేఆర్‌ఎంబీకి ఏపీ జలవనరులశాఖ లేఖ

ABN , First Publish Date - 2021-07-25T22:42:50+05:30 IST

కేఆర్‌ఎంబీకి ఏపీ జలవనరులశాఖ లేఖ రాసింది. కృష్ణా బేసిన్‌లోని రిజర్వాయర్‌లలో నీటిమట్టం పెరుగుతోందని

కేఆర్‌ఎంబీకి ఏపీ జలవనరులశాఖ లేఖ

అమరావతి: కేఆర్‌ఎంబీకి ఏపీ జలవనరులశాఖ లేఖ రాసింది. కృష్ణా బేసిన్‌లోని రిజర్వాయర్‌లలో నీటిమట్టం పెరుగుతోందని, పరివాహక ప్రాంతంలో వర్షాలు పడటంతో శ్రీశైలం, నాగార్జున సాగర్‌కు భారీగా వరద వస్తోందని లేఖలో పేర్కొన్నారు. శ్రీశైలంలో నీటిమట్టం 870 అడుగలకు చేరిందని, కుడిగట్టు విద్యుత్‌ కేంద్రంలో జలవిద్యుత్‌ ఉత్పాదనకు అనుమతివ్వాలని అధికారులు కోరారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం నీటిమట్టం పెరిగితే.. జలవిద్యుత్‌ ఉత్పాదన చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని, దాని ప్రకారం అనుమతివ్వాలని ఏపీ జలవనరుల శాఖ కోరింది.

Updated Date - 2021-07-25T22:42:50+05:30 IST