Advertisement
Advertisement
Abn logo
Advertisement

శాడిస్ట్ భర్తను కఠినంగా శిక్షిస్తాం: Vasi reddy

నెల్లూరు: జిల్లాలోని ఆత్మకూరులో భర్త ముందే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న మహిళ కుటుంబాన్ని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. అనంతరం పద్మ మీడియాతో మాట్లాడుతూ కొండమ్మ  ఆత్మహత్య ఘటన చాలా బాధాకరమన్నారు. భార్య ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంటే వీడియో తీసి భర్త పైశాచిక ఆనందం పొందడం దుర్మార్గమని మండిపడ్డారు. శాడిస్ట్ భర్తను కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. కొండమ్మ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాల న్యాయం చేస్తుందని, పిల్లలని ఆదుకుంటుందని వాసిరెడ్డి పద్మ హామీ ఇచ్చారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement