Advertisement
Advertisement
Abn logo
Advertisement

జగన్ ప్రభుత్వానికి కేసులు తప్ప ఇంకో పనిలేదు: శైలజనాథ్

విజయనగరం: రాష్ట్రంలో జగన్ ప్రభుత్వానికి కేసులు పెట్టి లోపల వేయడం తప్ప ఇంకో పని లేదని ఏపీసీసీ చీఫ్ శైలజనాథ్ దుయ్యబట్టారు. కరోనా కష్టకాలంలో ఎంత మంది అనాథలు అయ్యారో చెప్పేవారు లేరని ప్రభుత్వాన్ని ఆయన విమర్శంచారు. ప్రైవేట్ ఆసుపత్రులలో కోవిడ్ చికిత్సకు రూ.30 లక్షల వరకు బిల్లులు అవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో చివరికి ఇంటి ముందు ఉన్న చెత్త మీద కూడా పన్ను వేస్తున్నారని ఆయన విమర్శించారు. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే బొత్సా ఇంటి ముందు చెత్త వేసి ఆ చెత్తలోనే ఆయనను కలిపేస్తామని శైలజనాథ్ హెచ్చరించారు. 


మాన్సాస్‌పై జగన్ నిర్ణయం తప్పని ఆయన అభిప్రాయపడ్డారు. అది ఏ ఒక్కరి కుటుంబ వ్యవహారం కాదన్నారు. ఈ విషయంలో హైకోర్టు తీర్పును తాము సమర్థిస్తున్నామన్నారు. రాజకీయం చేయడానికి ప్రజల మెప్పు పొందాలన్నారు.  


Advertisement
Advertisement