Abn logo
Sep 24 2021 @ 00:46AM

శ్రీవారిని దర్శించుకున్న ఏపీసీసీ అధ్యక్షుడు

కదిరిఅర్బన్‌, సెప్టెంబరు 23: పట్టణంలోని ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని గురు వారం ఏపీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ సాకే శైలజానాథ్‌ కుటుంబ సభ్యులతో కలిసి దర్శిం చుకున్నారు. ఆలయంలో స్వామివారికి, అమ్మవార్ల ప్రత్యేక పూజలు చేయించారు. వీరికి అర్చకులు ఆలయ విశిష్టతను వివరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఏపీసీసీ రాష్ట్ర కార్యదర్శి కేఎస్‌ షాన్‌వాజ్‌, పీఎస్‌ అహమ్మద్‌, నాయకులు ఇమ్రాన్‌, నచ్చు బాలక్రిష్ణయాదవ్‌, ఇందాదుల్లాఖాన్‌, అమీర్‌సాబ్‌ తదితరులు పాల్గొన్నారు.