డిస్కమ్‌ల ప్రతిపాదనలు తిరస్కరించాలి

ABN , First Publish Date - 2022-01-26T08:37:44+05:30 IST

రాష్ట్ర డిస్కమ్‌లు ప్రతిపాదించిన కొత్త టారి్‌ఫలను ఆమోదిస్తే.. ఒక్క కరెంటు చార్జీలు మాత్రమే కాకుండా ప్రజలకు అవసరమైన అన్ని రకాల నిత్యవసర సరకుల ధరలు

డిస్కమ్‌ల ప్రతిపాదనలు తిరస్కరించాలి

  • విద్యుత్‌ చార్జీల పెంపుతో మోయలేని భారం
  • అన్ని నిత్యావసరాల ధరలూ పెరుగుతాయ్‌
  • ఏపీఈఆర్‌సీకి పలువురి సూచనలు

విశాఖపట్నం, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర డిస్కమ్‌లు ప్రతిపాదించిన కొత్త టారి్‌ఫలను ఆమోదిస్తే.. ఒక్క కరెంటు చార్జీలు మాత్రమే కాకుండా ప్రజలకు అవసరమైన అన్ని రకాల నిత్యవసర సరకుల ధరలు పెరిగిపోతాయని పలువురు వినియోగదారులు సూచించారు. అది మోయలేని భారంగా మారుతుందని, దీనిని దృష్టిలో ఉంచుకుని ఆ ప్రతిపాదనలను తిరస్కరించాలని కోరారు. రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి చైర్మన్‌ జస్టిస్‌ సీవీ నాగార్జునరెడ్డి విశాఖ నుంచి వరుసగా రెండో రోజు మంగళవారం కూడా వర్చువల్‌ విధానంలోనే ప్రజాభిప్రాయాలు సేకరించారు. మొత్తం 65 మంది పేర్లు నమోదు చేసుకోగా ఇప్పటివరకు 30 మంది అభ్యంతరాలు వ్యక్తంచేశారు.


ప్రభుత్వం నుంచి పంపిణీ సంస్థలకు ఎంత బకాయిలు రావలసి ఉందో అధికారులు వివరాలు చెప్పడం లేదని, అందులో గోప్యత పాటించాల్సిన విషయం ఏముందని వారు ప్రశ్నించారు. ఈ సందర్భంగా జస్టిస్‌ నాగార్జునరెడ్డి మాట్లాడుతూ.. డిస్కమ్‌ల ప్రతిపాదనలపై వినియోగదారుల స్పందన, చట్ట ప్రకారం ఎంత మేరకు ఇరువర్గాలకు న్యాయం చేయగలమో పరిశీలించి తదనుగుణంగా నిర్ణయిస్తామనన్నారు. డిస్కమ్‌లు ఆర్థికంగా బలహీనం కాకుండా.. వినియోగదారులపై భారం పడకుండా టారి్‌ఫలు ఖరారు చేస్తామని తెలిపారు. ఆఖరి రోజు ప్రజాభిప్రాయ సేకరణ గురువారం ఉంటుందని తెలిపారు. 

Updated Date - 2022-01-26T08:37:44+05:30 IST