Abn logo
May 4 2021 @ 19:57PM

వేదాంత వీజీసీబీకు అపెక్స్‌ ఇండియా హెల్త్‌ అండ్‌ సేఫ్టీ గోల్డ్‌ అవార్డు

విశాఖపట్నం: వేదాంత యొక్క వీజీసీబీకు గోల్డ్‌ అవార్డు లభించింది. న్యూఢిల్లీలో జరిగిన అపెక్స్‌ ఇండియా హెల్త్‌ అండ్‌ సేఫ్టీ కాన్ఫరెన్స్‌ 2020 వద్ద ఈ అవార్డును వేదాంత యొక్క వీజీసీబీకు అందజేశారు. ఈ అవార్డును వీజీసీబీకి పోర్ట్‌ సర్వీస్‌ రంగంలో ‘సేఫ్‌వర్క్‌ప్లేస్‌ మేనేజ్‌మెంట్‌’ విభాగంలో అందజేశారు. కార్యక్షేత్రంలో సురక్షిత నిర్వహణ ప్రక్రియలను అమలు చేస్తున్నందుకు గుర్తింపుగా ఈ అవార్డును వేదాంత యొక్క వీజీసీబీకు అందజేశారు. అపెక్స్‌ ఇండియా ఫౌండేషన్‌ నియమించిన స్వతంత్య్ర నిష్ణాతుల బృందం తమ ప్రమాణాలకు అనుగుణంగా పరిశీలించి, తనిఖీలు చేసిన తరువాత ఈ అవార్డుకు వీజీసీబీని ఎంపిక చేశారు. కంపెనీ తరపున ఈ అవార్డును అపెక్స్‌ ఇండియా ఫౌండేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ సభ్యులు మరియు అతిథుల చేతుల మీదుగా వీజీసీబీ హెడ్‌ హెచ్‌ఎస్‌ఈ శ్రీ ప్రసన్నకుమార్‌ అందుకున్నారు. 

Advertisement
Advertisement
Advertisement