ఏపీఎం, సీసీ సస్పెన్షన

ABN , First Publish Date - 2022-01-22T05:50:22+05:30 IST

మండలంలోని కోనుప్పలపాడు క్లస్టర్‌ పరిధిలో ఉన్నతి, స్త్రీనిధి నిధుల దుర్వినియోగంపై వైకేపీ ఏపీఎం హేమలత, సీసీ శేఖర్‌ను సస్పెండ్‌ చేస్తూ డీఆర్‌డీఏ పీడీ నరసింహారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

ఏపీఎం, సీసీ సస్పెన్షన
యాడికి వైకేపీ కార్యాలయం


ఉన్నతి, స్త్రీనిధి నిధుల మళ్లింపు, దుర్వినియోగంపై చర్యలు


యాడికి, జనవరి 21: మండలంలోని కోనుప్పలపాడు క్లస్టర్‌ పరిధిలో ఉన్నతి, స్త్రీనిధి నిధుల దుర్వినియోగంపై వైకేపీ ఏపీఎం హేమలత, సీసీ శేఖర్‌ను సస్పెండ్‌ చేస్తూ డీఆర్‌డీఏ పీడీ నరసింహారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. క్లస్టర్‌ పరిధిలోని ఓబుళాపురం, దైవాలమడుగు, పెద్దపేట, కేశవరాయునిపేట, లక్షుంపల్లి గ్రామాల సంఘాల్లోని రూ.3.36 లక్షల స్త్రీనిధి, రూ.18.01 లక్షల ఉన్నతి నిధులు మొత్తం రూ.21.37 లక్షలు దుర్వినియోగమైనట్లు అధికారుల విచారణలో తేలి ంది. ఆ మొత్తాన్ని ఏపీఎం హేమలత దుర్వినియోగం చేసినట్లు గు ర్తించి, ఆమెను సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలిచ్చారు. సీసీ శేఖర్‌ కోనుప్పలపాడు క్లస్టర్‌ పరిధిలోని గుడిపాడు, ఓబుళాపురం, పిన్నేపల్లి, పెద్దపేట పరిధిలో గ్రామసంఘాల నుంచి రూ.15.40 లక్షలు ఉన్నతి, రూ.8.88 లక్షలు స్త్రీనిధి సొమ్ము మొత్తం రూ.24.19 లక్షలు గ్రామ సంఘాల సభ్యుల పేరు మీద మంజూరైన నిధులను వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకున్నట్లు అధికారుల విచారణలో తేలింది. ఆ మేరకు సీసీ శేఖర్‌పై సస్పెన్షన వేటు వేశారు. గుడిపాడు గ్రామంలోని శివలీల గ్రామ సంఘం వీఓఏగా పనిచేస్తున్న మాధవి ఉన్నతి నిధుల నుంచి సభ్యులకు తెలియకుండా మరొక సభ్యురాలి పేరుమీద మం జూరైన అప్పును వ్యక్తిగత అవసరాలకు రూ.50వేలు తీసుకుని, అం దులో తాను పనిచేసిన కాలానికి రూ.30 వేలు వేతనంగా జమ చేసుకుందనీ, రూ.20 వేలు గ్రామ సంఘానికి వీఓఏ మాధవి అప్పు ఉ న్నట్లు గుర్తించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. క్లస్టర్‌ పరిధిలోని 7 సంఘాలకు రూ.8.50 లక్షల అప్పు అందలేదని అధికారుల విచారణలో తేలింది. దీంతో ఏపీఎం, సీసీపై చర్యలు తీసుకున్నారు.


Updated Date - 2022-01-22T05:50:22+05:30 IST